🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Naraayanaachyutaananda

DevotionalVijaya Vipanchi5k plays
Languages:
Telugu
PDF
ప|| నారాయాణాచ్యుతానంత గోవింద హరి | సారముగ నీకునే శరణంటిని || చ|| చలువయును వేడియును నటల సంసారంబు | తొలకు సుఖమొకవేళ దుఃఖమొకవేళ | ఫలములివె యీరెండు పాపములు పుణ్యములు | పులుపు దీపును గలిపి భుజియించినట్లు || చ|| పగలు రాత్రులరీతి బహుజన్మ మరణాలు | తగుమేను పొడచూపు తనుదానె తొలగు | నగియించు నొకవేళ నలగించు నొకవేళ | వొగరు కారపు విడెము ఉబ్బించినట్లు || చ|| ఇహము పరమును వలెనే యెదిటికల్లయు నిజము | విహరించు భ్రాంతియును విభ్రాంతియును మతిని | సహజ శ్రీవేంకటేశ్వర నన్ను కరుణింప | బహువిధంబుల నన్ను పాలించవే ||

Comments

Leave a comment

Related Songs

Garuda Gamana Tava

Devotional33.8k plays

Namah Parvati Pataye

Devotional27.9k plays

jaya janardhana krishna

Devotional14.6k plays

Vinavamma Urmila

Devotional14.1k plays

Muripaala Gopaala

Devotional12.7k plays