🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Nava Yuvaka Le Le Ra

PatrioticVijaya Vipanchi5.7k plays
Languages:
Telugu
PDF
నవయువకా లేలేరా శత్రుసేన మాతృభూమి నుండి పారద్రోలరా విజయ ధ్వజము గగన సీమ నేగురవేయరమ్మురా ||నవ|| శత్రుమూక దండయాత్ర చేయదోయి ప్రతి దినం కారుమబ్బులాకసాన క్రమ్మవోయి ప్రతి క్షణం హిమధరాధరమ్ము పిలుపునీయదోయి నిత్యము సమయమొచ్చే సమరమొచ్చే సాహసంబు చూపరా ||నవ|| సాహసాన సంగరాన శత్రుమూక దునుమగా కృతఘ్నులన్ శతఘ్నితోడ ప్రేల్చి కాల్చి వేయరా పరుల పాలబడిన భూమి మరల ముక్తినొందగా రాష్ట్ర దేహమందు నూత్న రక్తదీప్తి నింపరా ||నవ|| తరుణమందు సర్వశక్తి ధారవోయి వలెనురా తల్లి ఋణము దీర్చువాడే తనయులందు ఘనుడురా శీర్షమైన కోసియిచ్చు శక్తి పౌరుషంబులన్ కదనభేరి ధ్వనులతోడ ప్రళయ నృత్య మాడరా ||నవ||

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays