🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

neevu nenu hinduvaite with music

PatrioticVijaya Vipanchi5k plays
Languages:
Telugu
PDF
నీవు నేను హిందువైతే జీవితమ్మే ధన్యం. కులం పేరిట కలహమెందుకు కలిసి వుంటే భాగ్యము.. రాచపుండుల రేగుతున్నది అంటరానిభావము... రాజకీయపు పావు అయినది నిమ్న జన కులవాదము... ఎన్ని చట్టములున్నగానీ తొలగలేదీ దోషము.. అన్ని వైపుల పేద జనులకు జరుగుతున్నది మోసము !! సహపంక్తి భోజనమారగించి ఒకటి చేసిన తత్త్వము.. సమరసత లోకానికెపుడో చాటినది హిందుత్వము.. శబరి ఎంగిలి ఆరగించిన రాముడేరా సాక్ష్యము.. అన్ని కులముల పూజలందిన అరుంధతె ఆధారము. !! పరమతమ్ములో సమత గలదని మభ్యపెట్టే యత్నము.. హిందుమతమను చందమామలో మచ్చలెంచే కుతంత్రము.. ధనము చూపి దీఅంజనులను మతము మార్చుట దారుణం.. మనము ఒకటే..వేరు కాదని అనకపొవుటే కారణం..!! బడుగు జీవుల బాధ బాపి తీర్చుకోర నీ ఋణం.. కడను వుంచిన సోదరులతో చెలిమి చేద్దామందరం.. కులము కన్న గుణము మిన్నని తెలిపిదినది మన ధర్మము.. హిందువులలో పతితుడెవ్వడు లేడు లేడని చాటుదాం...!!

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays