🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Nirmalasura Gangaa Jala

PatrioticVijaya Vipanchi24.8k plays
Languages:
Telugu
PDF
నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రం రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారత దేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం || భారత దేశం || ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం దక్షిణాన నెలకొన్నది హిందు సముద్రం తూరుపు దిశ పొంగిపొరలె గంగా సంద్రం పశ్చిమాన అనంతమై సింధు సముద్రం || భారత దేశం || ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం రత్న గర్భ పేరుగన్న భారత దేశం ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం || భారత దేశం || కోకిలమ్మ పాడగలదు జాతీయగీతం కొండ కోన వాగు పాడు సంస్కృతి గీతం గుండె గుండె కలుసుకొనుటె సమరస భావం చేయి చేయి కలిపితేనె ప్రగతుల తీరం || భారత దేశం ||

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays