ఓ జన్మభూమి భారతి - ఓ పుణ్యభూమి భారతి
ఓ వందనీయ భారతి - అభినందనీయ భారతి
జీవన కుసుమమొసంగి ఆరాధింతుము జననీ
ఎన్నెన్ని జన్మలైనా నీ పూజ చేతుమమ్మా
నిన్నే స్మరింతుమమ్మా || ఓ జన్మభూమి||
నీ మకుట మైన హిమగిరి జగమెల్ల మెరయు చుండ
సాగరము రతనములతో అంజలి ఘటించుచుండ
నా మాతృభూమి ఇదియని ఎలుగెత్తి పాడుకొనుచు
నీ సేవ చేయ జననీ మా జన్మ ధన్యమమ్మా || ఓ జన్మభూమి||
శక హూణ మ్లేఛ్చులంతా ఈ భూమి నాక్రమింప
నీ స్ఫూర్తి తోడ జననీ విక్రముని వంటి వీరుల్
తమ సర్వ శక్తి తోడ జాతిని సమైఖ్య పరచి
అరి తతుల చండినారు నీ వీర పుత్రులమ్మా
నీ పూజ చేతుమమ్మా || ఓ జన్మభూమి||