🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Oka Deepam To Maryoka Deepam

PatrioticVijaya Vipanchi8.9k plays
Languages:
Telugu
PDF
ఒక దీపం తో మరియొక దీపం వెలిగించాలి హిందువులో చైతన్య దీప్తిని రగిలించాలి నేను నాది నా యిల్లన్నది ఈనాటలవాటు మనమూ మనదీ మనదేశమ్మని కావాలలవాటు హిందువులంతా ప్రతి దినమూ కలసీ మెలసీ ఒక చో చేరి అమ్మ భరతిని కీర్తిస్తూ పంచుకోవాలె మమకారం పెంచుకోవాలె సంస్కారం వ్యక్తి వేరనీ సమష్టి వేరని తలచితిమిన్నాళ్ళూ వ్యక్తి శ్రేయమూ సమిష్టి లోనే సమిష్టి లేనిదే వ్యక్తి లేడనీ సమాజరూపీ సర్వేశ్వరునీ సేవించుటయే తరుణోపాయం వ్యక్తి సుఖించును ఇహ పరమ్ముల ఇదియే కాదా మన ధర్మం హిందువు మరచెను ఈ మర్మం కొండల జనులు కోనల ప్రజలు నగరవాసులు గ్రామ వాసులు పండితులైనా పామరులైనా కుబేరులైనా కుచేలురైనా తరతమ భేదం లేనే లేదు తల్లి దృష్టిలో సమానమే పరమాత్ముని కృపకు పాత్రులన్నది హైందవ తత్వం వేదాంతం ఆచరించడమె పరమార్ధం దేశ ధర్మముల నిలిపెడి హిందువు పుడమి తల్లికై బ్రతికెడి హిందువు శీలం జ్ఞానం కలిగిన హిందువు శక్తియుక్తులా నెరపెడి హిందువు మానవతను మన్నించే హిందువు దానవతను దమనించే హిందువు ప్రఖర తేజముతొ ప్రతీప శక్తుల పరిమార్చించాలి ప్రగతిగామియై పరాక్రమించాలి

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays