🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Okate Desam Manadi Nijam Nijam

PatrioticVijaya Vipanchi25.5k plays
Languages:
Telugu
PDF
ఒకటే దేశం మనది నిజం నిజం ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం వర్ణములేవైనా మరి కులములెన్ని ఉన్నా వనంలోని చెట్లు మనం వసుదైవ కుటుంబకం || ఒకటే దేశం || భరతుడు పరిపాలించిన భారతదేశం మనది తరతరాల వారసత్వ సంపద మనకున్నది చేయి చాచి యాచించే అవసరమేమున్నది అంతకన్న హీనమైన బ్రతుకింకేమున్నది || ఒకటే దేశం || వాల్మీకి మనవాడే వ్రాసెను రామాయణం వ్యాసుండెవరో కాదు వ్రాసె మహాభారతం అష్టాదశ పురాణాలు అంతులేని గ్రంథాలు అందించిన ఋషులందరు వందనీయులే మనకు || ఒకటే దేశం || గుండెలలో భగవంతుని బంధించిన భక్తులు ప్రకృతినే శాసించిన పతివ్రతా మూర్తులు సత్యాన్వేషణకై తమ సర్వస్వాన్నర్పించిన త్యాగులు యోగులు భళిరే వీతరాగులెందరో || ఒకటే దేశం ||

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays