🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Oke rakta moke jaati

PatrioticVijaya Vipanchi6.7k plays
Languages:
Telugu
PDF
ఒకే రక్త మొకే జాతి ఒకే లక్ష్యమందరిదీ ఒకే బాట ఒకే పాట ఒకే ధర్మమందరిదీ హిందుత్వం మన ధర్మం గుండె గుండెకనుబంధం మానవులను శ్రేష్ఠులుగా మలచు దివ్య సాధనం సర్వ పంథ సమభావన ఏకసత్య ప్రతిపాదన సకల జగతి విష్ణుమయం సమర్పించు నీ హృదయం అని తెలిపెను హిందుత్వం ఇది మన కనుసరణీయం హితవు లేని జడవాదపు నినాదాల ఇజాలేల || ఒకే || ఒరులేయవి ఒనరించిన అప్రియములు తనకగునో ఒరులకు అవి చేయకునికి పరమధర్మమని ఎరిగి వేదవాక్కు శాంతిగీతి విస్మరింపబొకురా ధర్మపథము ననుసరించి జనతను నడిపింపరా || ఒకే || కలసి ఉంటు కలసి తింటు కలసి మెలసి అడుగులేస్తు పౌరుషమును పెంచుకొంటు ప్రగతిని సాధించుదాం అవినీతి కులతత్వం అంటరానితనం త్రుంచి అన్నదమ్ములందరికీ ఆత్మీయత పంచుదాం || ఒకే ||

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays