🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Paadudaam Paadudaam Bharati Jaya Geetam

PatrioticVijaya Vipanchi7.2k plays
Languages:
Telugu
PDF
పాడుదాం పాడుదాం భారతి జయ గీతం వాడిపోని వైభవాల పావన సంగీతం వేద శారదాంబ వేలు శృతి చేసిన పల్లవి సకల విశ్వ శ్రేయమే స్వర సంచారము దీనికి పరమ పదము పదమైనది ఈ పవిత్ర గీతికి యోగరాగమీ గానం ఆగదు ఏ యుగానికి || పాడుదాం || ప్రతి పులుగు ఈ పుడమిని పలుకును ఆ ప్రణవమే ఈ దేశపు దేహం ప్రత్యణువు ఆ గానమే తలలూచే తరులన్నీ విరబుసే విరులన్ని పడిలేచే అలలన్నీ పాడును ఆ గానమే || పాడుదాం || ఈ పొలాల పంటసిరులు తరగని శ్రీరాగం ఈ కోనల నాగుల బుస శంకరాభరణం ఈ చందన శీతల పవనాలలోని హిందోళం ఈ సుందర కాననాల కల్యాణి గమనం ప్రళయ ప్రభంజనమిచ్చట శివరంజనిగా ప్రతి ప్రభాత భూపాళం శుభ సూచనగా ( 2 ) || పాడుదాం ||

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays