🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Parama Vaibhava

PatrioticVijaya Vipanchi9.1k plays
Languages:
Telugu
PDF
పరమ వైభవ సిద్దికొరకై - దీక్షగైకొని సాగుదాం తనుమనోధన అర్పనలుగా - తల్లి సేవలు చేయుదాం ! పరమ వైభవ ! తల్లడిల్లుతూ తల్లి భారతి సుతుల రమ్మని పిలుస్తుంటే ముగలై కూర్చుండలేమోయి - మృత్యుశిలలై మ్రగ్గలేమోయి రుద్రులై శివమెత్తి లేచి విక్రమించే వీరులవుతాం క్షుద్ర శక్తుల కుల్చివేసి తల్లి ఋణమును తీర్చుదాం ! పరమ వైభవ ! అలలవాలుకు తలలు వాల్చము - ఏటిగతి కెదురీదగలమోయి మొహభందన కటిన పాశము తునాతునకలు చేయగలమోయి సుఖములందు ఆసక్తి లేదు - కష్టమంటే వెరపులేదు వీర రాణ కేశవాదుల అడుగు జాడలు ముందు కలవోయ్ ! పరమ వైభవ ! సంఘ శాఖా పుణ్య గంగను నిత్య స్నానములనాచరించి ఇహ పరమ్ముల ప్రగతి కొరకై జీవితపు మార్గమ్ము నెంచి పూర్ణ వికసిత శుద్ధ జీవన పుష్పములతో పూజ చేద్దాం రాష్ట్ర వైభవ యజ్ఞ వేదిని స్వీయ జీవన సమిధ వేద్దాం ! పరమ వైభవ !

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays