Home
Songs
Articles
Quotes
Contribute
Contact
🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.
Search
Songs
/
Pongiporalenu Sanga Ganga
Pongiporalenu Sanga Ganga
Patriotic
Vijaya Vipanchi
7k plays
Languages:
Telugu
Print
PDF
QR
Copy link
Share
Tabs
Side by side
Auto-scroll
Telugu
పొంగి పొరలెను సంఘగంగా పుడమి భారతి కణకణమ్మును పరమపావన మొనర్చంగా పొంగి పొరలెను సంఘగంగా ఉద్గమించెను పూజ్య కేశవ హృదయ కుహరములందు గంగా ఉరకలెత్తెను భరత జాతిని పరమవైభవ మొనర్చంగా కోట్ల హైందవ మానసమ్ములు మోక్షదాతగ తలచి కొలువగ ||పొంగి పొరలెను సంఘగంగా|| మాధవుడె జహ్నువుగ నిలిచి మార్గమును సుగమమ్ము చేసెను బాధలెన్నో దాటి జాహ్నవి భారతిని నలు దిశల ప్రాకెను బీడు వారిన హృదయ సీమల హైందవపు నవ ఝరుల నింపెను ||పొంగి పొరలెను సంఘగంగా|| మధుకరుడె రథసారథాయెను మాటలే మంత్రమ్ములాయెను జాతి జీవన క్షేత్రముల నవ జవము జీవము నింపి సాగెను వెలసె శతశత తీర్థ స్థలములు వెలిగె భారతమాత కన్నులు ||పొంగి పొరలెను సంఘగంగా|| సాగరమె గమ్యమ్ము కాగా సాధనా పథమందు సాగెను సర్వవ్యాపి సర్వస్పర్శి సంఘటనె లక్షముగ నురికెను రాష్ట్ర పురుషుని కరములందున అమృత భాండము సంఘగంగా ||పొంగి పొరలెను సంఘగంగా||
Comments
Leave a comment
Name *
Email (optional)
Rating
Comment *
CAPTCHA *
Submit comment
Related Songs
Sanghatanam Oka Yagyam
Patriotic
173.9k plays
Nirmala Sura Gangajala Sangama Kshetram
Patriotic
84.5k plays
Jayamu Jayamu bharata Mata
Patriotic
83k plays
Ide Mana Bharatam
Patriotic
65.5k plays
Rammu rammu bharata veera
Patriotic
60.4k plays
Ekatmata Stotram
Patriotic
58.3k plays