ప్రమిదలోని కళికలా జాతి కొరకు జ్వలిస్తా నా జాతి కొరకు జీవిస్తా
తరతరాల తపస్సూ నరనరాన నర్తించగ
గత వైభవ స్మృతులలో అనుక్షణం స్పందిస్తా
నా సభ్యత నా సంస్కృతీ ముందు తరంకందిస్తా
ముందు తరంకందిస్తా ||ప్రమిదలోని కళికలా||
గర్జించే నాదు గళం జాతి హృదయ స్పందనం
వికసించే నాదు కలం విమల భావ సందీప్తం
నే కార్చే స్వేద కణం నవ జీవన సోపానం
నవ జీవన సోపానం ||ప్రమిదలోని కళికలా||
సంఘర్షణ కాదు రక్తి సంఘటనం నాదు శక్తి
మంచికి నా మనసు సుమం చెడును చీల్చు వజ్ర శ్రమం
ఆశయాలకాలయం అగును నాదు హృదయం
అగును నాదు హృదయం ||ప్రమిదలోని కళికలా||