ప్రశస్త హైందవ ప్రజానీకమును ప్రేమ సూత్రమున కలపండోయ్
సమస్త మానవ కల్యాణానికి చక్కని బాటను వేయండోయ్
భారతి కీర్తిని నిలపండోయ్ - మన భారతి కీర్తిని నిలపండోయ్
పరధర్మమ్ములు పరతంత్రంబులు స్వతంత్ర భారత ధరిత్రి తగవని
తరతరాల మన చరిత్ర చాటిన పరమ సత్యమును గుర్తించండోయ్
పర కుతంత్రములు చీల్చండోయ్
భారతి కీర్తిని నిలపండోయ్ - మన భారతి కీర్తిని నిలపండోయ్
దివ్య తత్వమూ భవ్య జీవనము విలసిల్లిన మన విమల భారతిని
ధర్మరక్తినీ దేశభక్తినీ కార్యశక్తిగా మలచండోయ్
కర్మ వీరులై నిలవండోయ్
భారతి కీర్తిని నిలపండోయ్ - మన భారతి కీర్తిని నిలపండోయ్
విఘటనకెరయై వెతలకు గురియై కుమిలే జాతిని కాపాడండోయ్
అభినవ భారత నిర్మాణానికి అహరహమూ శ్రమియించండోయ్
ఆదర్శమ్ముగ జీవించండోయ్
భారతి కీర్తిని నిలపండోయ్ - మన భారతి కీర్తిని నిలపండోయ్
||ప్రశస్త హైందవ||