🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Pravahinche Naa Raktam

PatrioticVijaya Vipanchi5k plays
Languages:
Telugu
PDF
ఈ నేలతల్లి ప్రేమ .. ఎన్నటికి తరగనిదీ చెరగనిదీ... ఈ నా బ్రతుకుపై అధికారమున్నది తల్లికే.. ఏ దేశదేశాల ప్రజలైన చెవులార వింటె. కనుల కంటే .. నా అస్థికలపై, సమాధిపై జై హింద్ అని ప్రతిధ్వనించేను... పల్లవి: ప్రవహించే నా రక్తం ప్రజల కోసమే.. ప్రాణం పోతె పోనీ దేశం కోసమే.. చరణం 1 నా హృదయం నా దేహం నా సర్వస్వం అర్పించుకుంటా అమ్మకోసమే..!! చరణం 2 రామ భరతుల సోదర ప్రేమ అపూర్వం తల్లి సేవ లోనే ధన్యుడనవుతా..!! చరణం 3. సరిహద్దులో జవానునై ఉరిమిన వేళ, నేలకొరిగిన వేళ ఉగ్రవాద, ఉన్మాదుల తరిమిన వేళ నేను ఒరిగిన వేళ చేమంతుల, పూబంతుల మాలలు నాకొద్దు కీర్తి పతాకాలు, కాంత,కనకాలసలొద్దు చస్తే ఈ భువిలో మరుజన్మ కోరుతాను దాసుడనై ఉంటానని అమ్మనడుగుతాను ఎర్రకోటనెగిరే మువ్వన్నెల జండా.. వన్నెల జండా.. ఒరిగిన నా శవంపైన ఎగిరితె చాలంటాను మువ్వన్నెల జండా - ఎగిరితే చాలంటాను !!

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays