🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Rama dandu kadelera

PatrioticVijaya Vipanchi5.5k plays
Languages:
Telugu
PDF
రామదండు కదిలెరా - రామ కార్య సాధనకై అయోధ్యలో భవ్యమైన ఆలయ నిర్మాణం కై పల్లె పల్లె పరుగులెత్తె - పట్టణాలు హోరెత్తెను రామ నామ మంత్రంతో గడప గడప గళమెత్తెను శ్రీరాం జయరాం జయజయరాం శ్రీరాం జయరాం జయజయరాం !! 1. జన్మభూమి కరసేవలో తొలిగా ధ్వజమెగరేసి అవమానాలు సహియించి - బలిదానాలర్పించెను కళంకాన్ని తొలగించి వివాదాల నధిగమించి స్వాభిమాన సంకేతం రాముని గుడి నిర్మిద్దాం శ్రీరాం జయరాం జయజయరాం శ్రీరాం జయరాం జయజయరాం !! 2. రాముడంటే ఆదర్శం రాముడంటే ఆరాధ్యం రామనామమే ఇలలో సాటిలేని మహాబలం గుండెగుండెలో నిండుగ రాముని దర్శించుకొని మానవ కళ్యాణానికి రాముని గుడి నిర్మిద్దాం శ్రీరాం జయరాం జయజయరాం శ్రీరాం జయరాం జయజయరాం !! 3. రేగుపండ్లు తినిపించి శబరి ధన్యురాలయ్యెను అడవి రాజు గుహుడేమొ రాముని కాత్మీయుడయ్యె వారధి నిర్మాణానికి ఉడుత సాయమే సేయగ మన శక్తిని ధారవోసి రాముని గుడి నిర్మిద్దాం శ్రీరాం జయరాం జయజయరాం శ్రీరాం జయరాం జయజయరాం !!

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays