🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Randoyi randi mana Sanghaniki

PatrioticVijaya Vipanchi5.8k plays
Languages:
Telugu
PDF
రండోయి రండి మన సంఘానికి -దండలేద్దము దండిగా జననికి మూడు లోకాలలో ముచ్చటైనా తల్లి - వేడుకొన్నోళ్ళ నొళ్లోకి చేర్చే తల్లి కూడు గుడ్డా బ్రతుకు తెరువు నిచ్చే తల్లి - తోడు నీడై శుభములిచ్చినాది ||రండోయి రండి|| వీరాధి వీరులను గన్న మనయమ్మరా - ధారాళముగా భక్తవరుల విరజిమ్మెరా కవులు గాయకులు నిస్వార్ధ నాయకులకే - నెలవైనదీ భూమి అమ్మ అభయమ్ము చే ||రండోయి రండి|| దేశ దేశాల దీపాలారిపోయినా - దేవతల రాక్షసుల యుద్ధాలు దొర్లినా పెను తుఫానులు పెక్కు పెడిబొబ్బలేసినా - మిణుకు మిణుకంటు మన జాతి వెలిగిందిరా ||రండోయి రండి|| నాది నేనను సోది మరచి పోలేమా - మాది మేమని మనము కలసి రాలేమా నీతి నియమాల సంకేతాలె సాక్షిగా - గత అనుభవాలతో ప్రగతి సాధించమా ||రండోయి రండి||

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays