సంఘ జీవన భావ మధురిమల ననుభవించితిమి ఇచట మనం
ఈ ఆనందమె హిందువలందరి కందించాలి ఇకను మనం || సంఘ ||
ఎన్ని సమస్యలో ఎన్ని బాధలో అన్ని దాటి ఇట కరుదెంచితిమి
కష్టసుఖాలను కలిసి పంచుకొని కార్యకర్తలై మరలుదము || సంఘ ||
అన్నాదమ్ముల అనుబంధం ఎన్నడు వీడని సంబంధం
కలిగించినదీ సంఘ జీవనం కావాలది మన హృదయ ధనం || సంఘ ||
నా ధన బలములు నా కొరకేయను ఒంటరితనము తుంటరి గుణము
మంచుగడ్డలా మబ్బుతునకలా కరిగి తొలగినవి క్రాంతి కలిగేనిట || సంఘ ||
ఇది నవ హైందవ తపోవనం స్వార్ధము ప్రేల్చితిమిట హవనం
సంఘటనామృత జీవన సరళిని సాధించుట మన సాఫల్యం || సంఘ ||
నిత్య ప్రార్ధనా నియమపాలన నీతీ రీతీ నిలుపుకొని
భారతి పదముల తను మన ధనముల నర్పించుటకై తరలుదమూ || సంఘ ||