సంఘం పిలిచిందిరా హిందు వీర లేవరా
నిత్య శాఖ స్ఫూర్తితో దీక్ష నేడు పూనరా
కేశవునితొ ఉద్భవించె మాధవునితొ విస్తరించె
సర్వ వ్యాపి సర్వ స్పర్శి మన అందరి మార్గ దర్శి
సంఘ శాఖ దైవముగా సంఘటనే ప్రాణముగా
కలసి ఆడుదాము రా కలసి పాడుదాము రా
తరతరాల అస్పృశ్యత అంతరాలు తొలగించగ
యుగయుగాల మానవతా మూల్యాలను మహిపెంచగ
అరుణారుణ ధ్వజ చాయల సమరసతను సాధించగ
హిందుత్వపు ప్రగతి రధం సాగాలిక నిరంతరం
విఘటనతో హిందు జాతి సతమత మవుతుందిరా
జాతీయత హృదిని నింపి జాగృతినొనరించుదాం
వ్యక్తి వ్యక్తి నిర్మాణం సమైక్యతకు సోపానం
మాతృభూమి వైభవమే మన జన్మకు సాఫల్యం