🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Sarasa vaani Saraswati

DevotionalVijaya Vipanchi6.1k plays
Languages:
Telugu
PDF
సరస వాణి సరస్వతీ మా అజ్ఞానంతొలగించమ్మా .. విద్యాదాయిని సరస్వతీ మా జ్ఞాన జ్యోతి వెలిగించమ్మా... 1.కాళిదాసు నీ కటాక్షమ్ముతో కవి పండితుడై భాసిల్లె ... ఆది శంకరుని జ్ఞాన వైభవం నీ కృపతోనే శోభిల్లె..!! 2.వేదవ్యాస, వాల్మీకి కోకిలం నీ చరణము లే ప్రణమిల్లె... బమ్మెర పోతన నీ దయతోనే కమ్మనైన కవితలు అల్లె.. 3.వెండికొండవై మల్లె మాలవై చంద్ర వదనమై కరుణించు... శరత్కాలమున తెల్ల మేఘమై అమృతపానము వర్షించు.. 4.మంచిమాట మా నోట పలుకగా మనసులోన కొలువుండమ్మా.. మంచిబాటలో అడుగులు వేయగ సద్గుణాలు అందించమ్మా... 5.స్వామి వివేకుడు నిను ప్రార్థించి విశ్వసభలలో వెలుగొందె... నిను స్మరియించిన బుద్ధి వికాసం కలుగునట్లు మము దీవించు...!! సరసవాణి

Comments

Leave a comment

Related Songs

Garuda Gamana Tava

Devotional33.8k plays

Namah Parvati Pataye

Devotional27.9k plays

jaya janardhana krishna

Devotional14.6k plays

Vinavamma Urmila

Devotional14.1k plays

Muripaala Gopaala

Devotional12.7k plays