🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Shaktini Chupinchu

PatrioticVijaya Vipanchi2.1k plays
Languages:
Telugu
PDF
పల్లవి: శక్తిని చూపించు- సామర్థ్యం ప్రకటించు దేశ గౌరవం పెంపొందించగ - ప్రపంచమంతా పయనించు!! 1. వివిధ రూపముల విలసితమైన - జీవసృష్టియే అద్భుతము ఆత్మను అంతట దర్శించి వికాస పథమున విహరించు దోషము లెంచకురా - సద్గుణ సంపదలెంచుమురా - దేశ గౌరవం పెంపొందించగ - ప్రపంచమంతా పయనించు!! 2. జంతుజీవనం వినాశ కరము - మానవత్వమే మహోన్నతం కష్ట సుఖాల వెలుగు నీడలో చిరునవ్వులనే విరజిమ్ము ఒంటరితనమొద్దు- మరొకరి తోడును వదలొద్దు దేశ గౌరవం పెంపొందించగ - ప్రపంచమంతా పయనించు!! 3. దాగివున్న నీ ప్రతిభా పాటవ శక్తియుక్తులను వెలిగించు చెమటోడ్చే నీ జీవన శైలితో సుఖ వైభవాలు సాధించు కల్మశాలు వదలి సుందర హృదయం చూపించు దేశ గౌరవం పెంపొందించగ - ప్రపంచమంతా పయనించు!! 4. నిర్మల గంగలో మునకలు వేసి,పావన మంగళ భావన పొంది అమృత ధారలు పొంగి పొరలగ, భారతమాతను సేవించు, అరుదైన జన్మ నీది- త్యాగం తపస్సాచరించు దేశ గౌరవం పెంపొందించగ - ప్రపంచమంతా పయనించు!!

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays