Home
Songs
Articles
Quotes
Contribute
Contact
🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.
Search
Songs
/
Sreelu Pongina
Sreelu Pongina
Patriotic
Vijaya Vipanchi
20.7k plays
Languages:
Telugu
Print
PDF
QR
Copy link
Share
Tabs
Side by side
Auto-scroll
Telugu
శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై వరలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా !(2) వేద శాఖలు వెలసెనిచ్చట ఆదికావ్యం బలరె నిచ్చట | బాదరాయణ పరమఋషులకు పాదు సుమ్మిది తమ్ముడా ||శ్రీలు పొంగిన విపిన బంధుర వృక్ష వాటిక ఉపనిషన్మధువొలికెనిచ్చట | విపుల తత్వము విస్తరించిన విమల తలమిది తమ్ముడా || శ్రీలు పొంగిన సూత్ర యుగముల శుద్ధ వాసన క్షాత్ర యుగముల శౌర్య చండిమ చిత్ర దాస్యము చే చరిత్రల చెరిగిపోయెర తమ్ముడా || శ్రీలు పొంగిన మేలి కిన్నెర మేళవించీ రాలు కరుగగ రాగమెత్తి పాలతీయని బాలభారత పథము పాడర తమ్ముడా|| (శ్రీలు పొంగిన)|| దేశగర్వము దీప్తి చెందగ దేశచరితము తేజరిల్లగ | దేశమరసిన ధీరపురుషుల తెలిసి పాడర తమ్ముడా || (శ్రీలు పొంగిన)|| పాండవేయుల పదునుకత్తులు మండి మెరిసిన మహితరణ కధ | కండగల చిక్కని పదంబుల కలిపి పాడర తమ్ముడా|| (శ్రీలు పొంగిన)||
Comments
Leave a comment
Name *
Email (optional)
Rating
Comment *
CAPTCHA *
Submit comment
Related Songs
Sanghatanam Oka Yagyam
Patriotic
173.9k plays
Nirmala Sura Gangajala Sangama Kshetram
Patriotic
84.5k plays
Jayamu Jayamu bharata Mata
Patriotic
83k plays
Ide Mana Bharatam
Patriotic
65.5k plays
Rammu rammu bharata veera
Patriotic
60.4k plays
Ekatmata Stotram
Patriotic
58.3k plays