స్వప్రేరణతో తల్లి భారతిని సేవించుట మా మనో రథం...
సత్యనిష్ఠ గల స్వయం సేవకుగ రూపొందుటయే మా యత్నం..
వందే భారతం..వందే భారతం..వందే భారతం..!!
1. దేశభక్తి మా జన్మహక్కని - జాగృతమై ఇల పయనిద్దాం
ఈ భూమి బిడ్డలు హిందువులేనని స్వాభిమానముగ ప్రకటిద్దాం
క్షణం క్షణం జీవన మరణమ్మున దేశమాతనే కీర్తిద్దాం .. ఈ దేశమాతనే కీర్తిద్దాం !! స్వప్రేరణ తో !!
2. ప్రేమ భరితమౌ హృదయముండగా సన్మానాలు కాంక్షించం
పారితోషికం, పుష్పమాలలు, వ్యాపారాలను మోహించం
భగవంతుడె మన తోడు నిలువగా అహంకారమును వదిలేద్దాం...
దురహంకారము వదిలేద్దాం... !!స్వప్రేరణ తో!!
3. గంగానది లో మునకలు వేయగ నిత్య శాఖ లో వుందాము..
తనువు మనసులే పులకరించగా సంస్కారాలే పొందెదము..
ఆత్మ విజయము ను సాధించుటకై అనుశాసనమున జీవిద్దాం..స్వయమనుశాసనమున జీవిద్దాం !! స్వప్రేరణ తో!!
4.సమాజమున చైతన్య దీప్తులై ఇంటింటిని మేల్కొల్పాలి..
ఒక దీపం తో మరియొక దీపం వీధి వీధి వెలిగించాలి..వైభవ భారత లక్ష్య సాధనకు జీవితాలనే అర్పిద్దాం...మన జీవితాలనే అర్పిద్దాం !!స్వప్రేరణ తో !!