పల్లవి :
తల్లి భారతి పదముల వ్రాలి,
తను మన ధనముల అర్పణ చేద్దాం,
మార్పు కోసమే అందరి తపన
దేశ ప్రగతికై పరిశ్రమిద్దాం !!
చరణం 1
భగవంతునికి ప్రేమ పాత్రులం
దేశమాత ప్రియమైన పుత్రులం
మనలో మనకే భేదాలేలా
సమతా భావం పెంపోద్దిద్దాం!!
చరణం 2.
సంస్కారాలు,సభ్యత నిచ్చే
కుటుంబ విలువలె జీవనసారం
మానవ మనుగడ సుఖ శాంతులకై
పర్యావరణం పరిరక్షిద్దాం!!
చరణం 3
పౌరులమంతా బాధ్యత తెలిసీ, సమాజ హితమున పనులే చేసి,
స్వావలంబనం,సగర్వమ్ముతో
స్వదేశీ నిత్యం ఆచరిద్దాం!!