🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Talli Bharati Vandanam

PatrioticVijaya Vipanchi14.2k plays
Languages:
Telugu
PDF
తల్లి భారతి వందనం - వాత్సల్య పూర్ణా వందనం సుఖముగా వర్ధిల్లినాం - తనువునే అర్పింతుమమ్మా !! తల్లి భారతి 1.భవ్య హిందూరాష్ట్రమందున అవయవాలై నిలిచినాము శక్తిమంతుడు ఈశ్వరుణ్ణి సతతమూ ధ్యానించినాము హిందుభూమిలో హిందువులుగా జగతిలో వెలుగొందుతాము నీదు కార్యం పూర్తిచేయగ దీవెనలు అందించవమ్మా !! తల్లి భారతి 2.జగమంత ఎదురై పోరుసల్పిన తలను వంచని బలమునిమ్ము సకల విశ్వము సాదరమ్ముగ శిరము వంచెడి శీలమిమ్ము ముళ్ళబాటని తెలిసీ తెలిసీ నడుము కట్టి కదలినామూ మార్గమును సులభమ్ము చేయగ జ్ఞానమును అందించవమ్మా !! తల్లి భారతి 3.ఇహ పరమ్ముల సుఖం కొరకై - వీరవ్రతమును చేతబూని అంతరంగము ధ్యేయనిష్టతో జ్వాలయై వెలుగొందసాగెను విజయకాంక్షతో వీర హిందువు ధర్మరక్షణ ప్రతిన బూనెను దేశవైభవ పథమునందున శుభములను అందించవమ్మా !!తల్లి భారతి

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays