🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Vandanamo Bharatama

PatrioticVijaya Vipanchi7k plays
Languages:
Telugu
PDF
ప|| వందనమో భారతమా అందరమూ నీ వారమమ్మా, మేమందరమూ నీ వారమమ్మా!! ౧. వినీల గగనపు వీధుల తాకెడు, వింధ్య హిమాచల గిరిధారీ విశ్వవ్యాపిని విమల రూపిణీ, విజయభారతీ సుతులమమ్మా!!అంద!! ౨. గల గల పారెడి గంగా సింధూ, పదముల కడుగగ కావేరి పుణ్య నదమ్ముల నిండిన పావన, పుణ్యమూర్తిపుత్రులమమ్మా !! అంద!! ౩. వీరశివాజీ గురుగోవిందుల, పృధ్వీరాజు ప్రతాపసింహుల ధర్మరక్షకై దీక్షను బూనిన, ధీశాలుర వారసులమమ్మా !! అంద!! ౪. వ్యక్తివ్యక్తిలో దేశభక్తికై, అజేయమౌ సంఘటిత శక్తి కై ఆ జీవనమూ సాధన చేసిన, కేశవునకు అనుచరులమమ్మా !! అంద!! ౫. నిత్యము నీ పద పూజలు చేతుము, నీ కొరకే జీవి౦తుమమ్మా విశ్వమంతటికి నీ గత వైభవ, కీర్తిగీతి వినిపింతుమమ్మా !! అంద!!

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays