వందనీయ జననీ ఓ భారతావని
మహిమాన్విత తరణీ సౌభాగ్యజీవని
వేలవత్సరాల చరిత ఉన్న తల్లి నీవు
బాదరయణాది ఋషుల భారతివైనావు
వేద జ్ఞాన వారధై – సాధనాల సారధై
పరిశోధన ఫలములన్ని జగతికిచ్చినావు
పరవనితను తల్లిగ భావించాలను పద్ధతి
ప్రతి జీవిలో పరమాత్ముని కాంచుటలో సద్గతి
చూపించిన రీతి – బోధించిన నీతి
ఎన్నియుగాలైనా గాని మారదు ఈ సంస్కృతి
పాములనూ పూజించి పాలోసిన దేశం
సుఖ శాంతులకిది ధామం సద్గుణాల సంద్రం
సత్యం నీవదనం – సహనం ఆభరణం
హైందవ జీవన సారం ధర్మమే ఆధారం