వేద ఘోషలు వెలువరించిన హైందవమ్మే జీవనమ్మని
సమత మమతలు చాటిచెప్పిన భగవకేతన చేతనమ్మని
సంఘ గంగా భగీరధుడు కేశవుడె ఆదర్శమంటూ
కలసి పాడెదము మనము చరిత చాటెదము || వేద ||
మహా వేద సృష్టికర్తలు ఉద్భవించిన భారతమ్మని
సకల సంస్కారాల నిలయము తల్లి భారత ధాత్రి యంటూ
పుణ్య పురుషుల మాతృభూమికి వందనము లర్పించుకుంటూ
|| కలసి ||
జాతి ఉజ్జ్వల భావి కొరకై జనన మందిన వీరయోధుల
అనన్యములగు పరాక్రమములు ఆశయమ్ముల తోడ కలసి
దేశ ద్రోహుల తరిమికొట్టిన దేశభక్తిని స్మరణ చేస్తూ || కలసి ||
మాతృదేశపు బానిసత్వము మట్టుబెట్టగ ముందుకురికి
సమరయోధుల చెంతచేరి విధర్మీయుల నదరగోట్టిన
కేశవుని ఆ లోకమన్యుని వారసునిగా సంస్మరిస్తూ || కలసి ||