విశ్వభారత వీర లేవోయీ ప్రగతి పథముల వెంట పదవోయీ
స్వాతంత్ర్య వీరుండు రాణా ప్రతాపుండు
నీ జాతి వాడురా ప్రళయాగ్ని వీవురా
వీరాభిమన్యుండు పలనాటి బాలుండు
నీ సహోదరులురా లయ ఝంఝ వీవురా
ధీర ఝాన్సీరాణి నీ వీరమాతరా
కాకతీ రుద్రమ్మ నీ సోదరేనురా
మగువ మాంచాల నీ బంగారు వదినరా
వీర వంశము నీది వీర రక్తమ్మురా
పదునాల్గు భువనాల నిన్నడ్డు మొనగాడు
లేడురా జగదేక వీరుడవు నీవెరా
శివ సముద్రమ్మువై బడబాగ్ని జ్వాలవై
లంఘించి వెలుగరా లోకాలనేలరా