🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Viswa Yodula Vijaya Gaanam

PatrioticVijaya Vipanchi6.6k plays
Languages:
Telugu
PDF
విశ్వ యోధుల విజయ గానం మహానాదం వినండోయ్ వీర హైందవ సింహనాదం నాంది పలికే మహానాదం ||మహానాదం|| విజయమేయను వీర శంఖపు గగన ఘోషను వినగ రండోయ్ రసమయమ్మగు వంశి రవముల రుచులనెన్నో చూడరండోయ్ ధ్వం ధ్వమ్మను పణవ ధ్వనితో పదం పాడగ పదండోయ్ ఝణణ ఝణణను ఝల్లరులతో కదన మాడగ కదలిరండోయ్ ||మహానాదం|| అసుర బలమును మట్టుబెట్టిన ఉగ్ర నరసింహుని నినాదం రావణుని సంహర మొనర్చిన రామబాణపు హూంకారం శత్రు శిర విచ్చేద శస్త్రం సుదర్శన రణ ఘీంకారం అరి భయంకర భరత సైనిక వీర వర విజ్రుమ్భణం ||మహానాదం|| దేశ ధర్మోద్ధరణ చేద్దాం శత్రు శేషం త్రుంచి వేద్దాం వ్యక్తి వ్యక్తిని సంస్కరించి జాతి శక్తిగ మలచి వేద్దాం నిత్య సాధన తంత్ర పథమున సంఘటితముగ సాగుదాం పరమవైభవ దివ్య మంత్రం నరనరమ్మున నింపుదాం ||మహానాదం||

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays