🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Viswajanani Bharatamata Jayaketanamegisera

PatrioticVijaya Vipanchi2.7k plays
Languages:
Telugu
PDF
విశ్వజనని భరతమాత జయకేతన మెగసెరా అమృతోత్సవ సంబరమే అంబరమున నిలిచెరా "విశ్వ" 1. సనాతనము ఈ జాతి వినూతనము మనసంస్కృతి శ్రీరాముడు ఏలినట్టి పుణ్య జగతి భారతి శంకరాది రిషి వంద్యులు నడయాడిన కర్మభూమి గీతామృత ధారలనే వర్షించిన జ్ఞానభూమి " విశ్వ" 2. యవనులను పడగొట్టిన చంద్రగుప్త మౌర్యుడు శకులను తుదముట్టించిన విక్రమ ఆదిత్యుడు మొగలాయిల తొడగొట్టిన వీర శివా రాణాలు భళిభళి రే మన వీరులు ధరణి లోన శూరులు " విశ్వ" 3. అరుంధతి అనసూయలు పతివ్రతా శిరోమణులు పద్మావతి దుర్గావతి సుగుణశీల శిఖామణులు ఝాన్సీ రాణి రుద్రమ్మలు అరి వీర పరాక్రములు మాతృభూమి లో పుట్టిన మాణిక్యము లెందరో "విశ్వ" 4. స్వరాజ్య శంఖము నూదిన తిలక్ మహాశయుడు ఉరికంబమునే వరించె భగత్ సింగ్ ,రాజగురు తూటాలకు ఎదురొడ్డిన ఆజాదు ,అల్లూరి కణకణమును అణువణువును రగిలించిన ధీరులు "విశ్వ" 5. స్వేచ్ఛా వాయువు పీల్చిన మధురమైన జ్ఞాపకం ఐకమత్యమే బలమని గుర్తించిన సంబరం భవ్యమైన భరతావని కనుల ముందు దర్శనం విశ్వ గురువు గా చూసే క్షణమే అరుదెంచగా "విశ్వ"

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays