విశ్వమాత భరతావని యశో గీతి వినిపించగ
హిందు రాష్ట్ర సంఘటనకు నడుంకట్టి నడువరా , నడుంకట్టి నడువరా
రత్నగర్భ అన్నపూర్ణ మన దేశపు బిరుదులు
గత కాలపు ఘనతలాయే నేడు చూడ వింతలాయే
కోట్లకొలది సుతులున్నాం నీవు నేను బ్రతికున్నాం
మన శక్తిని ధారవోసి దరహాసం దర్శిద్దాం || విశ్వమాత ||
ఇతిహాసపు పుటలు తెరచి నీతి ఏమి నేర్వకున్న
గతకాలపు గౌరవాల గానమిచ్చు ఫలము సున్న
భరతమాత సుతులెల్లరు ప్రియసోదరులని యెరిగి
ఆత్మీయత తోడ మనము ఇక్యముగా మెలగుదాం || విశ్వమాత ||
మంచి మాట లేన్నియున్న జాతికి బలమే మన్నన
బలశాలుర మాటే గద తలదాల్చుట పుడమిలోన
మనమంతా జతగూడి పటుశక్తిని నిర్మించీ
అవనికి శాంతిని తెద్దాం అమ్మ పేరు నిల్పుద్దాం || విశ్వమాత ||