ఏదిరా నీ గాండీవం ఏది ఠ౦కారం
ఏది నీ రణ తూర్యనాదం ఏది హూంకారం ఏది హూంకారం
చంద్రగుప్తుని రూపు దిద్దిన చాణుక్యుని చతురతేది
జగద్గురుతకు రంగులద్దిన శంకరుని ఆ ప్రతిభ ఏది
ఏది నీ ధీ పటిమ ప్రజ్ఞా జ్ఞాన సౌరభము || 2 || || ఏదిరా ||
గ్రీకు హూణుల పీక నులిమిన భీకరమ్మౌ శౌర్యమేది
శక కుషాణుల పీచ మణచిన శ్రీకరమ్మౌ ధైర్యమేది
ఏదిరా నీ వీర విక్రమ ఘన పరాక్రమము || 2 || || ఏదిరా ||
బానిసలమై బ్రతుకులీడ్చిన ఫలితమే ఈ నాటి దుస్థితి
నివురు మరుగున దాగినదిరా నిప్పులా మనలోని శక్తి
నివురు తొలగనిదెట్లు కలుగును పరమ వైభవము || 2 || || ఏదిరా ||
ఎత్తరా నీ గాండీవం ఎలుగెత్తరా నీ దేవదత్తం
ఢీకొనరా పాశుపతమై చీల్చరా రిపు దుష్ట వ్యూహం
విశ్వ గగనము నెగురవేయగ విజయ కేతనము || 2 || || ఏదిరా ||