🎵 Welcome to Vijayavipanchi — new keertanas and multi-language lyrics are added regularly.

Yogulu Saagina Margamidi

PatrioticVijaya Vipanchi12.5k plays
Languages:
Telugu
PDF
యోగులు సాగిన మార్గమిది లోకములేలిన దుర్గమిది శాశ్వత శాంతుల స్వర్గమిది భగవాధ్వజ ఛాయలలో మాయని భరతావని దిగ్విజయమిది రాయికి రప్పకి చెట్టుకి చేమకి చరాచారమ్ములకన్నిటికీ నతమస్తకమౌ నతులు సలుపు పరమోన్నతమౌ ఘన సంస్కృతిది వినయము విద్యాభూషణమనుకొను విమల మనస్కుల వీడు ఇది దురహంకారము దరి చేరని మహనీయ జీవనుల మార్గమిది || యోగులు || సరళ జీవనము విరల చింతనము అవిరళ సరళి గణించినది ఆద్యంతములకు అటు నిటు నిలచిన ఆనందము పరికించినది గీతా జ్యోతిని ఒసగి చేతముల చేయూతగా నడిపించినది అజ్ఞానమునకు అందని ద్రష్టలు కాంచిన కాంచన స్వప్నమిది || యోగులు || కాలుడు రేపిన చీకటి ధూళి రక్కసి మూకల కర్కశ కేళి విసరిన వికృత విష వలయమ్మున విస్మృతి పొందిన విభవమిది పండిన పాపము పండగ కేశవుడవతరించు సంకేతమిది హాలాహలమును హరాయించుకొను అమృత హృదయుల స్వర్గమిది || యోగులు ||

Comments

Leave a comment

Related Songs

Sanghatanam Oka Yagyam

Patriotic173.9k plays

Nirmala Sura Gangajala Sangama Kshetram

Patriotic84.5k plays

Jayamu Jayamu bharata Mata

Patriotic83k plays

Ide Mana Bharatam

Patriotic65.5k plays

Rammu rammu bharata veera

Patriotic60.4k plays